కొంపల్లి ఏప్రిల్ 3
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కొంపల్లి నారాయణ పాఠశాలలో ఎస్ బి డి కె బ్రాంచ్ ప్రైమరీ గ్రేడ్ 5 విద్యార్థుల గ్రాడ్యుయేషన్ వేడుకలు ఎంతో ఘనంగా, ఆనందోత్సాహలతో నిర్వహంచబడ్డాయి.ఈ కార్యక్రమం విద్యార్ధుల జీవితంలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అలాగే తల్లిదండ్రుల, ఉపాధ్యాయులసహకారంతో ఈ విజయాలు
సాధ్యమయ్యాయని నారాయణ యాజమాన్యం పేర్కొన్నారు. ఈ సంధర్భంగా తమ పిల్లల అభివృద్ధిపై తల్లి తండ్రులు గర్వం వ్యక్తం చేయడమే కాక, చదువుతో పాటు అన్ని రంగాలలో పోటీతత్వంపెంపొందిస్తున్నారని ఇవి పిల్లల ఎదుగుదల కు కీలకం అని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో జి.యం. గేమీతారెడ్డి, డి.జి.యం పురుషోత్తం రెడ్డి, ప్రిన్సిపల్ భార్గవి, కో ఆర్డినేటర్ తబిత, వైస్ ప్రిన్సిపల్ దార సుప్రజ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్ధులు సాంస్కృతిక కార్య క్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ప్రాథమిక స్థాయి నుండి ఆరవతరగతికి వెళ్లే విద్యార్ధులకు స్కూల్ యాజమాన్యం ధృవపత్రాలు ప్రధానం చేశారు.
