రిజర్వేషన్ సాదించకపోతే రాజీనామాలకైన సిద్దం.ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మెన్ బోర్ర జ్ఝానేశ్వర్.

హైదరాబాద్ ఏప్రిల్ 3
(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్రం లో ముదిరాజ్ లు ఎదుర్కోంటున్న రిజర్వేషన్ మరికొన్ని సమస్యలు పరిష్కరించకపోతే
మంత్రి వాకిటితో సహ తాను రాజీనామా
కు సిద్దమని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ బోర్ర జ్ఝానేశ్వర్ ముది రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని బోయిగూడ ముదిరాజ్ సంఘం లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్ట్ ల సంఘం ఆత్యవసర సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్బంగా ముదిరాజ్ సమన్వయ కమిటీ ఆవశ్యకత ఏర్పాటు పై ఉన్న సమస్యలు,ముదిరాజ్ బిసి డి నుంచి ఏ లోకి
అనుసరించాల్సిన వ్యుహలు,
,కోకాపేట ముదిరాజ్ భవన నిర్మాణానిపై సలహాలు సూచనలు, ముదిరాజ్ జర్నలిస్ట్ లు ఎదుర్కంటున్న సమస్యలు నాలుగు అంశాలపై ఆయన వారితో చర్చించారు. స్వతంత్రం వచ్చిన నాటి నుండి జాతికోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి పనిచేసిన వారున్నరన్నారు. ఇప్పటి వరకు కులాన్ని తప్పుదోవ పట్టించేందుకు 40 కి పైగ ఇతర సంఘాలు ఏర్పాటు అయిన. మనం ఐక్యమత్యం తో ఉంటే అలాంటి వాటికి చేక్ పెట్టి సమన్వయం చేయాల్సిన ఆవసరం ఎంతైన ఉందన్నారు. అందులో భాగంగానే ఈటెల, కాసాని, బండ ప్రకాష్, మంత్రి వాకిటి అనే నలుగురు నాయకులను ఓకే వేదికపై రప్పించి సర్పంచులసన్మాన సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మా నేతలకు సంఘాలు లేవు. ఇకపై మీడియా, న్యాయ, మహిళ, విద్య, యువ ఇలా అన్ని విభాగాలతో కలిసి త్వరలో ఏర్పాటు అయ్యే సమన్వయ కమిటీ చేయాలన్నదే మా నిర్ణయమన్నారు. ఇప్పుడున్న సంఘాలు అలాగే ఉండని అవన్ని అందరిని కలుపుకోనే ముందుకు పోతాం అన్నారు. కమీటి వేస్తే జాతీకి ప్రయోజనం అనే అంశంగా భావిస్తూ గతంలోని మన కుల సంఘాల పెద్దలు చేసిన తప్పులు మళ్ళి మనం చేయవద్దని నా అభిప్రాయం. కోకాపేట భవనం స్థలం ఉంది డబ్బులు లేవు. మీరు అందరు సహకరిస్తే సాదించి తీరుతాం. మీ జర్నలిస్ట్ లతో త్వరలో మంత్రి వాకిటి తో సమావేశం త్వరలో ఏర్పాటు చేస్తా. కార్పొరేషన్ సహకారం తో నిదులు వచ్చిన వెంటనే కులానికి కేటాయిస్తా.ఎన్ని అటంకాలు ఎదురైన త్వరలో జిల్లాల పర్యటన తప్పక చేస్తా. అనంతరం సంఘం గౌరవ సలహదారుడు బలరాం ముదిరాజ్ మాట్లాడుతు అధికారం లోకి వచ్చాక ఇద్దరు నేతలు మాట్లాడటం గర్వనీయం. గతంలో కులాన్ని రాజకీయం గా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు ఇకపై ఆల జరుగదని అందుకే మొదట గా జర్నలిస్ట్ ల తోనే చర్చించి సమన్వయ కమీటి పై చర్చించడం అభిందనీయమన్నారు. సుప్రింకోర్టులో తప్పుడు సమాచారం, ఇవ్వడం కారణంగా నే రిజర్వేషన్ లో న్యాయం జరుగలేదు. సమన్వయ కమిటీ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి లో ఏర్పాటు చేస్తారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలి. కోర్టు లో ఈ ఆంశం లేదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పలనే కోరగా బిసి కమీషన్ పరిదిలోనే ఉంది. మన రిజర్వేషన్ పై కాంగ్రెస్ పార్టీ పై పూర్తి భాధ్యత ఉంది. కోకాపేట భవన నిర్మాణం లో అనేక తప్పిదాలు జరిగాయని ఆయన తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షులు చింతల నిలకంఠం ముదిరాజ్ మాట్లాడుతు సంఘాలు ఎక్కువై కులానికి అగంపట్టిస్తున్నరు,
మన మిడియా ను వాడుకుంటున్నారు మరిచి పోతున్నరు. ఆరుగురిని సమన్వయ కమిటీ లో చోటు ఇవ్వాలి. 1800 మంది సభ్యులు గా ఉన్నాం. మిగత వారు ఇతర సంఘాలతో ఉన్నారు. ఇక్కడ సమావేశం గతంతో పోల్చుకుంటే మన విజయం. ఇతర బిసి కుల మిడియా సంఘం రాజకీయ ఫార్టీలను నడుపుతుంది. జర్నలిస్ట్ లకు ఇచ్చే విలువ ఇస్తే నాయకులకు వచ్చే విలువ వస్తది. రిజర్వేషన్ పక్రియ మనం తెచ్చేది కాదు ముఖ్య నేతలు అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకోవడంతోసాధ్యం. కోకపేట భవనం టెండర్ పనులలో రాజకీయం జరిగిందని ఆయన తెలిపారు .వేం నరెందర్ రెడ్డి తో గతంలో చర్చించాం తిరిగి అక్కడ తో ఆగకుండా ముందు కు పోదాం. సంఘం రాష్ట్ర
ప్రధానకార్యదర్శి బోయిని శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతు పుట్టగోడుగులాగా కులం లో కోత్త సంఘాల రిజిస్ట్రేషన్ చేసి, యూట్యూబ్ లలో సోషల్ మిడియా ద్వారా కులాన్ని అపహస్యం చేసి మాట్లాడుతున్నారు. కామరెడ్డి డిక్లరేషన్ ను సి ఎం తో కలిసి చర్ఛించి రిజర్వేషన్ నిర్ణయం తీసుకోవాలి. ఇంకా రెండు సంవత్సరాల కాలంలోగా నిర్ణయం తీసుకోండి. భారీ బహిరంగ సభ త్వరలో ఏర్పాటు చేయండి. మిడియాను అదరిస్తే అండగా ఉంటాం. హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షులు గడ్డమీది శ్రీశైలం, వాసు ముదిరాజ్ ,పాండు ముదిరాజ్, శివ ముదిరాజ్, మేడ్చల్ జిల్లా ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు సుగ్రీవుడు ముదిరాజ్, అనిల్ కుమార్ ముదిరాజ్, మల్లేష్ ముదిరాజ్ యాటకర్ల, వేంకటేష్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, వాసు ముదిరాజ్, జితేందర్ ముదిరాజ్, బాబుముదిరాజ్, సత్యం ముదిరాజ్, దినేష్ ముదిరాజ్, స్వామి ముదిరాజ్ అంబర్పేట్ సతీష్ ముదిరాజ్, గోనేల కుమార్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *