జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుంటిగంగ తిరునాళ్ల శుక్రవారం అత్యంత వైభవంగా జరిగిం-జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. గతంలో కంటే అధిక సంఖ్యలో ఈ పర్యాయం భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎండోమెంట్ అధికారులు అమ్మవారి దర్శనంలో ఇబ్బందులు తలెత్తకుండా బారీ కేడ్లు ఏర్పాటు చేసి క్యూలో భక్తులుఅమ్మవారిని దర్శించుకునేందుకు వనతులు కల్పించారు. అమ్మవారికి పొంగళ్లు పెట్టడం ఆనవాయితీ కావటంతో అధికసంఖ్యలో మహిళలు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పశుసంపదను, వాహనాలను తీసుక వచ్చి అమ్మవారి చూట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు జరిపారు. గంగమ్మగుడి ప్రక్కనున్న నాగదేవత స్వామికి, కృష్ణమందిరం, శివాలయాలను దర్శించుకుని పూజలు జరిపారు. తిరునాళ్ల సందర్భముగా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకోసం ఆయా సామాజిక వర్గాలకు చెందిన అన్నదాన పత్రాల వద్ద వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దర్శి డిఎస్పీ లక్ష్మీనా యణ పర్యవేక్షణలో దర్శి సిఐ వై. రామారావు నేతృత్వంలో ఎన్ఐ
మల్లికార్జునరావు
పోలీసులు తిరునాళ్లలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరునాళ్ల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పోలీసులు పికెట్ వద్ద అందుబాటులో వుండి దొంగలపై, అనుమానితులపై దృష్టిసారించి ముందస్తుగా, అదుపులోని తీసుకున్నారు. తిరునాళ్లకు వచ్చిన భక్తులకు తేజా వృద్ధాశ్రమం వారు మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు.
గంగమ్మతల్లికి ప్రత్యేకపూజలు చేసిన ప్రముఖులు…
జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి, దర్శి టీడీపీ ఇంచార్జి గొట్టిపాటి …. …
జడ్పీచైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపిజిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లు దర్శి టీడీపీ ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ క
డియాల లతిత్ సాగర్ దర్శించుకున్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు జరిపారు. దేవదాయశాఖ అధికారులు ఈఓ నర్రానారాయణ రెడ్డి, ఆర్ఏ లు
ప్రసాద్, శ్రీనివాస రావులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ ఇంచార్జి గొట్టిపాటి వెంట ఎంపీపీ తాటికొండ శ్రీను, టీడీపీ మండల అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, బి.ఓబుల్ రెడ్డి, చైర్మన్ వాసు, వల్లభనేని నుబ్బయ్య, మన్నేపల్లి నమర, రాచకొండ వెంకట్రావు, వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి వెంట మండల వైసీపీ అధ్యక్షులు టీ వి సుబ్బారెడ్డి, వైసీపీరాష్ట్ర సంయక్త కార్యదర్శి మాజీఎంపీపీ పోశం మధునూదన్ రెడ్డి, గుజ్జుల యోగిరెడ్డి, కటకంశెట్టి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
10 విద్యుత్ ప్రభల ఏర్పాటు …
తిరునాళ్ల సందర్భంగా శివరామపురం, కొర్రపాటి వారి పాలెం, తూర్పుగంగవరం, మాధవరం, తురక పాలెం, టిపిపి, జనసేన, వైసీపీ అభిమానులు పది విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసారు.





