ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. కారుణ్య కోటాలో ఉద్యోగాలు పొందిన 9 మందికి గురువారం ఆయన నియామక పత్రాలు అందించి అభినందనలు తెలిపారు. విధుల నిర్వహణలో పరిజ్ఞానం పెంచుకొని మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
