రక్తదానం ప్రాణదానం తో సమానం – కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పసుమర్తి సుధాకర్

రక్తదానం ప్రాణదానం తో సమానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా ఎందరికో పునర్జీవాన్ని అందించిన వారు అవుతారని సంతనూతలపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పసుమర్తి సుధాకర్ అన్నారు శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సుధాకర్ మరియు వారి కుమారుడు పసుమర్తి.శశాంక్ పాల్ తో కలిసి రక్తదానం చేసి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఏసుక్రీస్తు మరణించిన రోజుగా చెప్పబడుతున్న గుడ్ ఫ్రైడే రోజున రక్తదానం చేయటం ఎంతో సంతోషకరం గ్రామ గ్రామాన రక్తదానం పై ఉన్న అపోహలను తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వారికి అవగాహన కలిగించి రత్తదాతలుగా వారిని తయారు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలియజేశారు. క్రీస్తు మార్గం అందరికీ అనుకరణీయంగా ప్రపంచానికి చాటి చెప్పిన ఏసుక్రీస్తు సేవలను మనందరం సాకారం చేయాలని క్రైస్తవ సోదరులకు పిలుపునిచ్చారు. అందరికీ గుడ్ ఫ్రై డే శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *