బేగంపేట ఏప్రిల్ 4
(జే ఎస్ డి ఎం న్యూస్) :
వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలనీ ట్రాఫిక్ 2 అడిషనల్ డీసీపీ సి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. అన్నారు. హైదరాబాద్ సిపి వీ సీ సజ్జనార్, ట్రాఫిక్ కమిషనర్ జోయల్ డేవిస్ ల ఆదేశాల మేరకు బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శనివారం ట్రాఫిక్ ఉల్లంఘన దారులకు ట్రాఫిక్ నియమాలు రహదారి భద్రతపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా:వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ వినియోగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ జంపింగ్, అతి వేగం, ట్రిపుల్ రైడింగ్ వలన కలిగే ప్రమాదాల గురించి మరియు జీబ్రా లైన్స్ ఉపయోగించడం వలన కలిగే లాభాలు , రోడ్డుపై
అప్రమత్తంగా ఉండి డ్రైవింగ్ చేయాలన్నారు. బాధ్యతగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలనునివారించవచ్చని, రోడ్డు భద్రతానియమాలను పాటించడం మన అందరి బాధ్యత అని వివరించారు. బేగంపేట టిటిఐ ఇన్స్ పెక్టర్ నాగుల అశోక్ మాట్లాడుతూ ట్రాఫిక్ ఉల్లంఘన దారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహనా కల్పించారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదు. ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు వారు వాహనాలు నడపరాదని అది చట్టరీత్య నేరమన్నారు.ప్రతి ఒక్కరూ విద్యార్థి దశనుండి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని తెలియజేశారు. రోడ్ దాటునపుడు జీబ్రా లైన్స్, నడవడానికి ఎల్లప్పుడూ ఫుట్పాత్నుఉపయోగించడం వలన కలిగే లాభాలు తెలియజేశారు. ఎల్లప్పుడూ తల్లిదండ్రులను మరియు పెద్దలను గౌరవిస్తూ క్రమశిక్షణతో ఉండాలి, బస్సు, ఆటో, కారు ఎక్కేటప్పుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారు. ట్రాఫిక్ సైన్‌బోర్డులు, ప్లకార్డులు ఉపయోగించి రోడ్ పై మన భద్రతతో పాటు ఇతరుల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకత గురించి వారికి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో టి. టి. ఐ. బేగంపేట్ సిబ్బంది కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి. అడిషనల్ డిసిపి ట్రాఫిక్ 2 సి. వేణుగోపాల్ రెడ్డి.
04
Apr