బాబూ జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

కంటోన్మెంట్ ఏప్రిల్ 5,(జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆదివారం బాబూ జగ్జీవన్ రామ్ గారి 119 వ జయంతి వేడుకలు ఘనంగా
నిర్వహించారు.బాలంరాయి చౌరస్తాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తో పాటు
కలిసి పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అలాగే నియోజకవర్గంలో పలు చోట్ల చోట్ల నిర్వహించిన జయంతి వేడుకలలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని వారి విగ్రహాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనడానికి బాబూ జగ్జీవన్ రామ్ గారే నిదర్శనమని , అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆజన్మాంతం పనిచేసిన ధీరుడని, అంటరాని తనానికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేసి జన చైతన్యం తెచ్చిన సామాజిక సంస్కర్తని ,దేశ ఉప ప్రధానిగా, సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్ గా పనిచేసి చట్టసభల్లో తన సత్తా చూపిన ఆయన ఆఖరి క్షణం వరకు దళిత జాతి సముధ్ధరణ కోసమే పరితపించారని ఎమ్మెల్యే అన్నారు. ఈ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే తో పాటు తెలంగాణ విత్తనాభివృధ్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్ లు రాగిరి ఆనంద్ బాబు, దేవేందర్ , మాజీ ఛైర్మన్, వైస్ చైర్మన్ లు కదిర్వన్, వేణు గోపాల్ రెడ్డి, బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జయ ప్రకాష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ, వైష్ణవి యాదవ్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *