25 రోజులుగా తాళ్లూరు మండల కేంద్రంలో రామతీర్థం మంచినీరు రాక ప్రజలు విలవిలాడుతున్నారు.
ప్రజలకు శుభ్రమైన మంచి నీరు అందించాన్న లక్ష్యంతో జల మాసోత్సవం ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే కనీసం జల మాసోత్సవంలో అయినా సరే శుద్ద నీరు కాదు….అసలు నీరే అందించలేని ఘనత ఆర్ డబ్ల్యు ఎస్ శాఖకు దక్కుతుంది. దశాబ్దాలుగా తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ పరిధిలో ఉన్న మంచి నీటి ట్యాంకులో నిత్యం నీరు నిల్వ ఉంటూ మండల కేంద్రంలోని ప్రజల దాహార్తి తీర్చుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచి నీటి సంక్షోభం ఏర్పడినది. నిత్యం నీరు ఉండే తాళ్లూరు, కొత్త పాలెంలలో ట్యాంకులలో సైతం మంచి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగర్ నీరు తాగటం అలవాటు పడిన ప్రజలు మాత్రం సాగర్ నీటి కోసం ఇతర గ్రామాలు, పలు మండలాలకు వెళ్లి క్యాన్ లలో తెచ్చుకుంటున్నారు.
ఒక వైపు మండే ఎండలు మరో వైపు తాగు నీరు అందించలేని ప్రభుత్వ యంత్రాంగం తీరును ప్రజలు నిశితంగా విమర్శిస్తున్నారు. మాటలు కోటలు దాటతాయి.. కాళ్లు గడప తాటవు …..అన్న దానికి ఆర్ డబ్యు ఎస్ అధికారుల పనితీరే నిదర్శమని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని మంచి నీటి సరఫరాను పునరిద్దరించాలని ప్రజలు కోరుతున్నారు.

