వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షుడు ,
దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలి పారు. పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ
కేక్ ను డాక్టర్
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కట్ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు కనపర్తి శేషారెడ్డిల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియో జకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున, ఒంగోలు పార్ల మెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒం గోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు
తదితరులు ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, అభిమానులు రక్త దానం చేశారు.
కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జ్ చింతలపూడి ఆశోక్ కుమార్, మాజీ పీడీ సీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య. పార్టీ కార్యాదర్శులు కేవీ రమణారెడ్డి. వై.వెంకటేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే కె.ఆదెన్న, బి.రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిలు పాలడుగు రాజీవ్, పి. మధుసూదన్ రెడ్డి , వైఎస్సార్ సీపీ నాయకులు
దుంపా చెంచిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ. వెన్నపూస వెంక టేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్ వెన్నపూస కుమారి, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహా గౌడ్, సోషల్ మీడియా ప్రెసిడెంట్ శివకృష్ణారెడ్డి, త్రిపురాంతకం ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, చీమకు ర్తి ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, దర్శి మాజీ ఏఎంసీ చైర్మన్ వెన్నపూస వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు నెమలిదిన్నె చెన్నారెడ్డి. కిస్టిపాటి శేఖరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
దర్శి చీమకుర్తి లలో….

దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జన్మదిన సందర్భంగా దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ లకు పుష్పగుచ్ఛాలు అందజేసి తమ అభినందనలు తెలియజేశారు. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, మరింతగా ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. చీమకుర్తిలో దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి స్మృతి వనంలో ఆయనకి పూలమాలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్ రెడ్డి, మాజీ ఏఎంసి చైర్మన్ వెన్నపూస వెంకట్ రెడ్డి ( మహేష్), వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి ,కొల్లా భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

ముందుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని డాక్టర్ బూచేపల్లి కుటుంబం సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.










