ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం
వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆశ సేవలను గుర్తు చేస్తూ ర్యాలీలో నిర్వహించారు. కంటి వైద్యశిబిరం నిర్వహించారు. 20 మంది కంటి శస్త్ర చికిత్సల నిమిత్తం శంకరా కంటి హాస్పటల్ కు తరలించారు. కార్యక్రమంలో డాక్టర్ రాజేష్, పీఎంఓఓ ఉమా, హెచ్ ఎన్ రవి ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
