బేగంపేట ఏప్రిల్ 8 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రైనీ పైలట్ పైన ఇన్స్ట్రక్టర్ లైంగిక దాడి చేసిన ఘటన చోటు
చేసుకుంది. సోదరుడులా భావించే ఓ ట్రైనీ అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే నీతో పాటు మీ కుటుంబ సభ్యుల పరువు పోతుందంటూ బెదిరించడంతోపాటు నీ కెరీర్ కు కూడా నష్టం కలిగిస్తా అంటూ బెదిరించాడు. ఇటీవల కాలంలో అతని బెదిరింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి…… నగరానికి చెందిన యువతి (20)బేగంపేటలోని ఏవియా కాన్స్ పైలెట్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ లో 20 25 సంవత్సరంలో శిక్షణ నిమిత్తం చేరింది. ఆ సమయంలో అక్కడ ఇన్స్ట్రక్టర్లుగా పనిచేస్తున్న కేరళ రాష్ట్రం కొట్టాయం పై కోమ్ ప్రాంతానికి చెందిన నసిముద్దీన్ అలియాస్ నసీం (30), తో పాటు సల్మాన్ సలీం (35)లతో ఆమెకు పరిచయం ఏర్పడింది. నసీముద్దీన్ ను సోదరుడుగా , సల్మాన్ సలీం ను ఒక తండ్రిగా యువతి భావించి, వారితో సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది. ఈ చనువుతో బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉండే నసిముద్దీన్ వద్దకు చదువు కోడానికి తరచూ వెళ్తుండేది. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ సాయంత్రం గం 6:30 ల ఆమె అతని వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో నసిముద్దీన్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు.ఇద్దరు కలిసి కొంతసేపు చదువుకున్నారు. గం 7 . 30నిల సమయంలో నసిముద్దీన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ది లీగ్ లో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్ కు వెళ్లి అర్ధరాత్రి గం12 గంటల ప్రాంతంలో తిరిగి తన రూముకు వచ్చాడు. అప్పటివరకు ఒంటరిగా చదువుకున్న యువతీ నసిముద్దిన్ రాగానే తన స్నేహితురాలి వద్దకు వెళ్లాలని బయలుదేరింది. అయితే ఇక్కడే ఉండాలి అంటూ యువతిని అతను పట్టుబట్టాడు. ఈ సమయంలో తన కుటుంబ సభ్యులు తనకు బలవంతంగా పెళ్లి చేశారని, తన భార్య తనను మోసం చేసిందని తరచూ తనను ఆమె వేధింపులకు గురిచేస్తుందని, యువతకి చెప్పి నమ్మబలికాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. ఈ క్రమంలో యువతి కొద్దిసేపు అక్కడే ఉండగా, తలుపుకు గడియ పెట్టి న నసీముద్దీన్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి నోరు మూసి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే నీతో పాటు నీ కుటుంబం అంతు చూస్తానంటూ బెదిరించి ఆమెను భయపెట్టాడు.. అతని బెదిరింపులకు భయపడిన యువతీ ఆ తర్వాత దమ్మాయిగూడలో ఉండే మరో ఇన్స్ట్రక్టర్ సల్మాన్ సలీం ఇంటికి వెళ్తుండేది. ఈ విషయం తెలుసుకున్న నసీముద్దీన్ దమ్మాయిగూడకు మకాం మార్చి అక్కడ కూడా ఆమెను బెదిరించడం కొనసాగించాడు. నిరంతరం తనను బెదిరింపులకు గురిచేస్తుండడంతో మంగళవారం యువతి బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నసీరుద్దీన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బేగంపేట లో ట్రైనీ పైలట్ పైన అత్యాచారం….సోదరుడులా భావించినవాడే లైంగిక దాడి చేశాడు – యువతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.
08
Apr