భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా జల ధార కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని ఎంపీడీఓ పి అజిత కోరారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఇరిగేషన్ శాఖ ఎఈ సుబ్బా రావు ఆధ్వర్యంలో నచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, ఎపీఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జల ధార పెంపునకు మండలంలో అవకాశం ఉన్న ప్రాంతాల గుర్తింపును ఎఈ సుబ్బారావు వివరించారు. ఎప్రియల్ 15 వరకు జలధార కార్యక్రమంలో పనుల గుర్తింపు, 16 నుండి 20 వరకు పనులు మంజూరు, 21 నుండి పనులు ప్రారంభం ఉంటుందని చెప్పారు. చెరువులు పూడిక తీత పనులు, కాలువల మరమ్మత్తులు, నీటి సంరక్షణ చర్యలపై అవగాహన, సమర్థవంతమైన నీటి నిర్వహణ దృష్టి సారించాలని ఎంపీడీఓ కోరారు. ఎపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
