అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌861 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనంరూ. 15 వేల కోట్ల‌కు పైగా విలువైన భూమిని కాపాడిన ప్ర‌భుత్వంక‌బ్జాల‌కు ఆస్కారం లేకుండా చుట్టూ ఫెన్సింగ్‌ముఖీం గెస్టు హౌస్తో పాటు ఫామ్ హౌస్ కూల్చివేత‌

హైద‌రాబాద్‌, ఏప్రిల్ 11:  న‌గ‌ర చ‌రిత్ర‌లో నిలిచిపోయే భారీ ఆప‌రేష‌న్‌ను ప్ర‌భుత్వ‌ యంత్రాంగం శ‌నివారం నిర్వ‌హించింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

* గ‌తంలో ఎన్న‌డూ లేని విదంగా 861ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రాతో క‌లిసి రెవెన్యూ, మున్సిప‌ల్ శాఖ‌లు కాపాడాయి.

* ఈ భూమి విలు మార్క‌ట్లో రూ. 15 వేల కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా.

* భారీ పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిప‌ల్ శాఖ‌ల‌తో పాటు ఇత‌ర విభాగాలు ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించాయి.

* ఇప్ప‌టికే ఇల్లు క‌ట్టుకుని ఉన్న వారిని మిన‌హాయించి మిగిలి ఉన్న ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది.

* ఇల్లు క‌ట్టుకున్న పేదలు, సామాన్యులు ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు మైకులో అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు మైకు ద్వారా ప్ర‌క‌టించాయి.

* య‌థాత‌థ స్థితిని కొన‌సాగించాల‌నే కోర్టు ఉత్త‌ర్వుల‌ను ఏమాత్రం లెక్క చెయ‌కుండా ప్లాట్లుగా అమ్మేస్తున్న వారికి ప్ర‌భుత్వ యంత్రాంగంతో క‌లిసి హైడ్రా చెక్ పెట్టింది.

* చ‌ట్టాలంటే భ‌యం లేకుండా.. అధికారుల‌ను లెక్క చేయ‌కుండా ఇష్టారాజ్యంగా క‌బ్జాలు చేసి అక్క‌డ లావాదేవీలు నిర్వ‌హిస్తున్న వారికి ఫుల్ స్టాప్ పెట్టింది.

* భారీ పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య 861 ఎక‌రాల‌కు ఫెన్సింగ్ వేసింది. రెవెన్యూ, మున్సిప‌ల్ అధికారుల స‌మ‌క్షంలో హైడ్రా యంత్రాంగం ఈ భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది.

* ఐలాపురంలోని భూముల విష‌యంలో య‌థాత‌థ స్థితిని కొన‌సాగించాల‌ని 2013లో హైకోర్టు ఇచ్చిన తీర్పున‌కు అనుగుణంగా ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించారు.

* హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను ప‌ట్టించుకోకుండా.. 2.20 ఎక‌రాల్లో ముఖీం సోద‌రుడు ఎంఏ అజీం నిర్మించిన 6 అంత‌స్తుల 3 ట‌వ‌ర్ల‌ను తొల‌గించారు.

* స్విమ్మింగ్‌పూల్‌తో స‌హా విలాస‌వంతంగా నిర్మించుకున్న ఇంటిని.. ఇంటి చుట్టూ 40 ఎక‌రాల మేర గ‌డీలు పెట్టి నిర్మించుకున్న ఫామ్ హౌస్‌ను, గుర్రాల‌కోసం నిర్మించిన శాల‌ల‌ను తొల‌గించారు.

* కోర్టు తీర్పులు పెండింగ్ ఉండ‌గా.. ఆ భూమితో ఎలాంటి సంబంధం లేని ముఖీంతో పాటు అత‌ని అనుచ‌రులు ఇష్టానుసారం అమ్మ‌కాలు చేస్తుండ‌డాన్ని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది.

*

* ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తూ వంద‌ల కోట్ల రూపాయిల గ‌డించ‌డ‌మే కాకుండా వ్య‌వ‌స్థ‌ల‌న్నిటినీ మేనేజ్ చేసుకుంటూ కోట్లు గ‌డించిన‌ట్టు ఆరోప‌ణ‌లు ముఖీమ్మీద ఉన్నాయి.

* మొత్తం 1263 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉండ‌గా.. ఇప్ప‌టికే కొన్ని ఇళ్లు నిర్మాణం జ‌రిగింది. పేద‌లు క‌ట్టుకున్న ఇళ్ల‌ను మిన‌హాయించి ఖాళీగా ఉన్న 860 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని ప్ర‌భుత్వం కాపాడింది.


————————

* ఈ భూమికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు..

* సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండ‌లంలోని ఐలాపూర్ గ్రామంలోని 1 నుంచి 220 స‌ర్వే నంబ‌ర్ల వ‌ర‌కూ 1263 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉంది.

* నిజాం పాల‌కుల‌కు చెందినదిగా ఇది రికార్డుల్లో ఉంది. విలీన ప్ర‌క్రియ ప్ర‌కారం ప్ర‌భుత్వ భూమిగా రికార్డుల‌కెక్కింది.

* 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ (W.A.No.10/98 & ఇతర కేసులు తేదీ: 04.07.2003 )ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. అప్ప‌టి జాయింట్ క‌లెక్ట‌ర్ 1263 ఎక‌రాల‌ను ప్రభుత్వ భూమిగా ప్రకటించారు.

* 1980 ద‌శ‌కంలో అక్క‌డ రెండు లే ఔట్‌లు వ‌చ్చాయి.  495 ఎక‌రాల‌తో రాజ‌గోపాల్‌న‌గ‌ర్ కాల‌నీ, 131 ఎక‌రాల‌తో విద్యుత్ ఎంప్లాయీస్ కో ఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్‌లు వ‌చ్చాయి.

* 1263 ఎక‌రాల భూమిలో 475 ఎక‌రాలు త‌మ‌దంటూ ఓ కుటుంబం ప‌ట్టాల‌ను చూపిస్తూ వ‌స్తోంది. వీరంతా కోర్టును ఆశ్ర‌యించి తుది తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు.

* నిజాం పాల‌క‌లుద‌గ్గ‌ర దివాన్‌గా ఉన్న వ్య‌క్తి ద‌గ్గ‌ర ముఖీం తండ్రి ప‌ని చేసేవాడ‌ని.. ఆయ‌న‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేర‌కు 19 ఎక‌రాల భూమి ముఖీం తండ్రికి స‌మ‌కూరింద‌ని స్థానికులు చెబుతున్నారు.

* వాస్త‌వానికి ఇదంతా ప్ర‌భుత్వ భూమే అయిన‌ప్ప‌టికీ.. ముఖీం తండ్రికి చెందిన 19 ఎక‌రాల భూమిలో కూడా లే ఔట్ వేసి అమ్మేసిన‌ట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఆ 19 ఎక‌రాల‌తో పాటు.. మ‌రో 21 ఎక‌రాల మేర క‌బ్జా చేసి ఫామ్ హౌస్ నిర్మించిన‌ట్టు అక్క‌డి లే ఔట్ ప్లాట్ల య‌జ‌మానులు ఆరోపిస్తున్నారు.

* 1998 లో ఈ భూమిపై హై కోర్టు స్టే విధించింది.  2013లో మళ్ళీ హై కోర్టు స్టే విధించింది.

* 1998లో స్టే ఆర్డర్ను పట్టించుకోకుండా తప్పుడు పత్రాలతో 2006లో గెస్ట్ హౌస్ను నిర్మించిన mukheem.

* 2013 స్టే ఆర్డర్ ను కూడా లెక్క చేయకుండా భూములను అమ్మేసిన mukheem.

* 2013 లో హైకోర్టు ( W.A.M.P. No.263/2013)ఇచ్చిన ఆదేశాల ప్రకారం, సంబంధిత భూములపై యాజమాన్యం కలిగిన లేదా ఆక్రమణలో ఉన్న ఎవరైనా ఆ భూముల స్వరూపాన్ని మార్చకూడదు, ధ్వంసం చేయకూడదు అని స్పష్టం చేసింది.

* ఇలా కోర్టు వివాదాలు పెండింగ్‌లో ఉండ‌గా.. మూడో వ్య‌క్తిగా ముఖీం అనే వ్య‌క్తి అక్కడి భూములు తెగ‌న‌మ్మ‌డం ప్రారంభించాడు. స్టే ఆర్డ‌ర్‌ను ప‌ట్టించుకోకుండా అక్క‌డ నిర్మాణాలు చేప‌ట్టాడు.

* 40 ఎక‌రాల విస్తీర్ణంలో ముఖీం ఫార్మ్ హౌస్ నిర్మించారు. అందులో ఈత కొల‌ను నిర్మించి విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నారు.

* ప్రస్తుతం W.A. No.114, 115, 116/2013, 126/2013తో పాటు.. A.S. No.520/2010 కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉండి, తుది విచారణకు రానున్నాయి.

* ఈ నేప‌థ్యంలో అక్క‌డి భూమిని కాపాడాల‌ని అమీన్పూర్ తహసీల్దార్ HYDRAA కమిషనర్ నివేదిక సమర్పించారు.

హైకోర్టు (W.A.M.P. No.263/2013 తేదీ: 26.09.2013 న )ఇచ్చిన మధ్యంతర ఆదేశాల మేర‌కు య‌థాత‌థ స్థితిని కొనసాగిస్తూ, ఆక్రమణలను నివారించాలని కోరారు.

* దీంతో  అమీన్‌పూర్ మండ‌లం ఐలాపూర్ విలేజ్‌లోని ప్ర‌భుత్వ భూములను రెవెన్యూ, మున్సిప‌ల్‌, పోలీసు స‌హ‌కారంతో హైడ్రా చ‌ర్య‌లకు శ్రీ‌కారం చుట్టింది. ఇప్ప‌టికే నిర్మించిన ఇళ్ల జోలికి వెళ్ల‌కుండా కంచె వేసింది.

* కంచె వల్ల స్థానిక గ్రామస్తులకు, ఐలాపురం తండా నివాసితుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖాళీగా ఉన్న భూమిని కాపాడుతూ ఫెన్సింగ్ వేసింది.

* హైకోర్టు ఆదేశాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న రిట్ అప్పీలు తుది నిర్ణయం వచ్చే వరకు, సంబంధిత భూములను యథాతథ స్థితిలో పరిరక్షించడంలో భాగంగా హైడ్రా ఈ చ‌ర్య‌లు తీసుకుంది

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *