అంబేద్కర్ ఆశయాలు ఆచరించాలి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి.టి టి ఐ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారితో ప్రమాణం చేయించిన ట్రాఫిక్ పోలీసులు.

బేగంపేట ఏప్రిల్ 14 , (జె ఎస్ డి ఎం న్యూస్) :
అంబేద్కర్ ఆశయాలు ఆచరించాలని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలను బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్ ట్యూట్ లో నిర్వహించారు. టిటిఐ ఏసిపి లక్ష్మణ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ ఆదేశాల మేరకు ఈ వేడుకలు నిర్వహించారు. ముందుగా టిటిఐ సిబ్బంది కృష్ణ సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారితో ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటిస్తామని, ఎప్పుడూ నిబంధనలు ఉల్లంఘించమంటూ , ప్రమాణం చేయించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలుఉల్లంఘించకుండా ఉండాలన్నారు మైనర్ డ్రైవింగ్ సెల్ఫోన్ డ్రైవింగ్ చేయరాదని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కృష్ణారావు టిటిఐ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *