బేగంపేట ఏప్రిల్ 14 , (జె ఎస్ డి ఎం న్యూస్) :
దళిత బహుజనుల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బేగంపేట డివిజన్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాలలో బేగంపేట మాజీ కార్పొరేటర్ టి. మహేశ్వరి తో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్ర హక్కులను కల్పించిన అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని, ప్రతి ఒక్కరూ ఆయన చరిత్రను భావితరాలకు తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి నాయకులు శ్రీహరి, నరేష్ అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.



