మాధవరం ఎస్సీ కాలనీలో కమ్యూనిటి అవసరాల నిమిత్తం నిర్మించిన భవనాన్ని అదే కాలనీకి చెందిన పాలెపోగు రామయ్య ఆక్రమంచి నివాసం ఉంటున్నారని ఆ గ్రామ మాజీ సర్పంచి పాలెపోగు దాసు, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, గ్రామ టిడిపి అధ్యక్షుడు సోము శ్రీను సోమవారం గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసారు. రామయ్య కుమారుడు పాలెపోగు మార్క్ ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చెయ్యాలని అడిగిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కోన్నారు. తహసీల్దార్ ఫణీంధ్ర పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారి వెంట రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ బి ఓబులు రెడ్డి, మానం రమేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.
