నేలలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతు పై ఉందని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తూర్పుగంగవరంలో బుధవారం ఢాత్రి మాత బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.
భూమి ఇప్పటికే సహజ లక్షణాలను కోల్పోయినదని, ఇంకా పంటలు పండటానికి అనువుగా లేకుండా పోక ముందే నేలలను పరిరక్షించుకోవాలని కోరారు. వేసవి వడ గాలులకు నేలపై పొరలలోని సారవంతమైన పోషకాలు ఆవిరి కాకుండా పచ్చిరొట్ట పైర్లను, నవ ధాన్యాలను చల్లుకోవాలని కోరారు. అకాల వర్షాలకు పడు జల్లులకు మొలచి పచ్చని పంట పొర ఉండటం వలన పోషకాలు నేలలోని నిలుస్తాయని చెప్పారు. విఏ ఏ వి సుప్రజ రైతులు పాల్గొన్నారు.
