నువ్వు పంట కోతల్లో నిల్వ చేయటంలో మెళుకువలు పాటించాలి

నువ్వుల పంట గింజలు రాల్చు సమయంలో, నిల్వ సమయంలో కొన్ని మెళుకువలు పాటించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. మండలంలోని శివరామపురంలో నువ్వుల కళాలను ఆయన పరిశీలించి రైతులకు కొన్ని సూచనలు చేసారు. మండలంలో 400 ఎకరాలలో నువ్వులు సాగు చేసినట్లు చెప్పారు. నువ్వుల కాయలు ఆకు పనుపు రంగుకు మారి రాలటం ప్రారంభమైనప్పుడు 75శాతమ పనుపు వర్ణానికి వచ్చినప్పుడు కోతలు మొదలు పెట్టాలని చెప్పారు. గింజల్లో తేమ శాతం 8కి తగ్గేవరకు ఎడలో ఆరబెట్టాలని సూచించారు. నాణ్యమైన విత్తనం, పురుగు మందుల అవశేషాలు లేకుండా ఎగుమతులకు అనుకూలం అని వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *