వెన్నెముక కండరాలక్షీణతతో బాధపడుతున్న యువకులకు రూ1లక్ష 23వేల ఆర్థిక సాయం

మండలంలోని మాధవరంగ్రామంలో వెన్నెముక కండరాల క్షీణతవ్యాధితో భాధపడు తున్నయువకులకు వినుకొండకు చెందిన వ్యక్తులు, మాధవరం గ్రామానికి చెంది వినుకొండలో స్థిరపడ్డ వారు రూ1 లక్ష 23వేల ఆర్థిక సాయం మంగళవారం అం దజేశారు. ఆగ్రామానికి చెందిన కొడిమెలవెంకట్రావు కుమారులు ఆదిత్యకుమార్, రవి ప్రకాశ్ లు యుక్త వయస్సులో వెన్నెముకకండరాల క్షీణత వ్యాధి గ్రస్తులై బాధ పడుతున్నారు. ప్రతినెల ఆఇద్దరి అన్నదమ్ములకు 96వేల రూపాయల విలువైన మెడిసన్ వాడాల్సి వుంది. ప్రభుత్వ పరంగా సీఎం రిలీప్ ఫండ్ అల్వోసిగా కొంత నగదు అందజేశారు. ఆయువకులు వెన్నెముక కండరాల క్షీణత వ్యాధితో బాధప డుతూ వున్నారని, వెంకట్రావు ఆర్ధిక స్థితి లేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నట్లు పలువురు దాతల దృష్టికి వెళ్లింది. మాధవరం గ్రామస్తులు వినుకొండలో స్థిర పడ్డ
వారు ఆవిషయాన్ని అక్కడి వారికి చెప్పటంతో ఊడిగ శ్రీను, కన్నెబోయిన వెంకటే శ్వర్లు, అన్న వెంకటకోటేశ్వరరావు, గరుడ యూత్ పోలేశ్వరరావులు మందుకు వచ్చి ఆఇద్దరికి మందులకు గాను లక్షా 23వేల నిధులు సమకూర్చారు. మాధవరం
గ్రామానికి వచ్చి ఆ ఇద్దరు అన్నదమ్ములను చూసి చలిం చిపోయారు. తమ వంతు సేకరించిన నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. దాతృత్వంలో ఆర్థిక సాయం చేసిన వారికి వ్యాధిగ్రస్తుల తండ్రి వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమారుల క్షేమం కోసం తమకు తోచిన రీతిలో సహకరించాలని ప్రాదేయప డుతున్నాడు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *