బేగంపేట మే 6,
(జే ఎస్ డి ఎం న్యూస్):
పరేడ్ మైదానం లో నిర్వహించనున్న ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలంటూ బేగంపేట తో పాటు పరేడ్ మైదానం పరిసర ప్రాంతాల్లో ప్రధానికి స్వాగతం పలుకుతూ నెమలి ఆనంద్ ,రాజలక్ష్మి ల ఆధ్వర్యంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.గోడలపైన కమలం పువ్వులు వేసి స్వాగతం పలుకు తున్నారు.సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్,బేగంపేట బి జె పి కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాజలక్ష్మి ఆనంద్ పేరుతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నెమలి ఆనంద్,రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పరేడ్ మైదానం లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ సభను జయప్రదం చేసేందుకు బేగంపేట డివిజన్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళతామని,సభను విజయవంతం చేస్తామని అన్నారు.ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికలలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ,హోంమంత్రి అమిత్ షా ల నేతృత్వంలో బి జె పి అధికారాన్ని దక్కించుకోవడం కార్యకర్తల్లో జోష్ నింపిందన్నారు.



