వైఎస్సార్ సీపీ నాయ
కుడు ఐవీ రెడ్డి తండ్రి గ్రామ పెద్ద ఇడమకంటి చిన కోటిరెడ్డి బుధవారం సాయంత్రం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ, అద్దంకి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు వైవీ భద్రారెడ్డిలు గురువారం తాళ్లూరులో వారి నివా సంలో చిన కోటిరెడ్డి మృతదేహానికి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, ఐవీ సుబ్బా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టివి సుబ్బారెడ్డి ,జిల్లా పార్టీ సెక్రటరీ మారం ఇంద్రసేనారెడ్డి, మాజీ జెడ్పీటీసీ లోకిరెడ్డి జి వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షుడు ఆలోకం హరిబాబు, పులి ప్రసాద్ రెడ్డి, రైతు , యూత్ ,విద్యార్థి,ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు గువ్వల శ్రీనివాస్ రెడ్డి, కొర్రపాటి విష్ణు, కైపు అశోక్ రెడ్డి, యామర్తి ప్రభుదాస్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నుసం నాగార్జునరెడ్డి, నాయకులు కోట కృష్ణారెడ్డి, చార్లెస్ సర్జన్, కోట మన్నేరెడ్డి, గోపీ పాల్గొన్నారు.

