హైదరాబాద్ ,మే 8,(జే ఎస్ డి ఎం న్యూస్) :
పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే క్రీడల్లో రాణిస్తున్న బేగంపేట ట్రాఫిక్ ఏఎస్ఐ వి. శ్యామల అరుదైన ఘనత సాధించారు. పూణేలో జరిగిన నేషనల్ వెపన్ షూటింగ్ పోటీల్లో పాల్గొన్న ఆమె రైఫిల్ షూటింగ్లో గోల్డ్ మెడల్, పిస్టల్ షూటింగ్లో సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటారు. ఈ నేపథ్యంలో ఆమె సాధించిన మెడల్స్, సేవా రత్న పురస్కారం, మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ప్రదానం చేసిన డాక్టరేట్‌ను డీజీపీ సీవీ ఆనంద్ ను కలిసి
చూయించారు.వాటిని డిజిపి చేతుల మీదుగా అందుకున్నారు. శ్యామల ప్రతిభను చూసి ముగ్ధులైన డీజీపీ ఆమెను ప్రత్యేకంగా కీప్ ఇట్ అప్ వెరీ గుడ్ అంటూ అభినందించారు.
జూలైలో జపాన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ వెపన్ షూటింగ్ మాస్టర్ గేమ్స్‌కు శ్యామల ఎంపికయ్యారు. అయితే అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అయ్యే భారీ ఖర్చుపై డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ తన వంతు ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. గతంలో నేషనల్ లెవల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలో ఆమె బంగారు పతకాలు సాధించినప్పుడు కూడా తన వంతు ప్రోత్సాహకాన్ని డీజీపీ అందజేశారు. తల్లిదండ్రులు లేని తనకు డీజీపీ అండగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్నారని శ్యామల భావోద్వేగంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.


