కిషోర బాలికలు ఆరోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని వక్తలు అన్నారు. మండలంలోని రమణాల వారి పాలెంలో శుక్రవారం బాల బాలికల సాధికారిత వేసవి వికాసంలో బాగంగా కిషోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ-2 సుధాకర రావు, ఎపీఎం దేవరాజ్, పిడీఓ శేఖర్, ఎంపీహెచ్ఎస్ మాలతి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ బి సునీత, ఆరోగ్య కార్యకర్తలు చక్రవర్తి, పద్మావతిలు పాల్గొని కిషోర బాలికలు 11 నుండి 18 సంవత్సరాల లోపు వారు తమ భవిష్యత్కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఆరోగ్య మేళా, అనీమియాపై అవగాహన, కిషోర బాలికల ఆరోగ్య సమస్యలను వివరించారు. బాలికలు పాఠశాల వయస్సులో తప్పనిసరిగా విద్యపై దృష్టి సారించాలని ఎంఈఓ 2 సుధాకర్ రావు సూచించారు. పనిలో కాకుండా బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పరంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వినియోగించుకోవాలని చెప్పారు. బాలకార్మిక వ్యవస్థ లేకుండా, డ్రాప్ అవుట్స్ కాకుండా చిన్నారులను బడికి పంపాలని కోరారు. 18 సంవత్సరములు వచ్చిన తర్వాత మాత్రమే వివాహం చెయ్యాలని లేకుండా ఎదుర్కోవాల్సిన అనేక శారీరిక, మానసిక సమస్యల గురించి వివరించారు.

