తాడు బందు శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న క్రికెటర్ అనికేత్ వర్మ….

సికింద్రాబాద్, మే 8,(జే ఎస్ డి ఎం న్యూస్)
ఐపీఎల్ సందడిలో భాగంగా నగరానికి వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ క్రికెటర్ అనికేత్ వర్మ శుక్రవారం తాడ్‌బండ్ శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అనికేత్ వర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కంటోన్మెంట్ ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు ఆదిత్య యాదవ్, ఖుష్ అగర్వాల్ కూడా క్రికెటర్ వెంట ఉండి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు అనికేత్ వర్మకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు పలికారు. సన్‌రైజర్స్ ఆటగాడిని చూసేందుకు స్థానిక అభిమానులు, భక్తులు పెద్ద ఎత్తున ఆలయ పరిసరాలకు చేరుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *