11-18 ఏళ్ల మధ్య వయస్సులు గల కౌమార బాలికల సర్వతో ముఖాభివృద్ధి, ఆరోగ్యభద్రత, విద్యా వికాశం మున్నగు అంశాలతో రక్షణ కల్పిస్తూ ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించటమే కిశోరి వికాసం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని ఎంపీడీవో పి. అజిత అన్నారు. స్థానిక మండలపరిషత్ సమావేశం హాలులో మండల స్థాయి అధికారులు, కిశోర వికాసం గ్రామ, మండల స్థాయి కమిటీ అధికారులతో కిశోర వికాసం వేసవి సెలవుల శిక్షణ కార్యక్రమం శనివారం జరిగింది. కిశోర బాలికల అభ్యుతికోసం గ్రామస్థాయి నుండి అధికారులు, గ్రామకమిటీ సభ్యులు బాధ్యతగా పని చేయాలన్నారు. ఈనెల 1వ తేదీ నుండి కిషోర వికాసం కార్యక్రమం జరుగుతున్నా కొందరు ఉద్యోగులకు ఈ కార్యక్రమం గురించి అవగాహన లేక పోవటం బాధాకరమన్నారు.
ప్రతి విషయాన్ని గ్రామ స్థాయ కమిటీలు అవగాహన కల్గివుం డాలన్నారు. నెల పదిరోజుల పాటు జరిగే ఈకార్యక్రమంలో కిశోరబాలికలకు పూర్తిగా అవగాహన కల్గించాలన్నారు. ఈ కార్యక్రమంను సిబ్బంది క్షేత్రస్థాయిలో పూర్తిగా నిర్వహించకుంటే ఉన్నతాధికారులకు నివేదించటం జరుగుతుందన్నారు. కిశోరవికాశం కోఆర్డినేటర్ వీరాంజనే యులు మాట్లాడుతూ చిన్న వయస్సుల్లో వివాహాలు అపటం బాలికలవిద్యకు ప్రాధాన్యత నివ్వటం, బాలికల్లో పెరు గుదల వేగంగా వుండే దశలో పోషకాహారలోపం శారీరక మార్పులు గురించి , బాలికలవిద్యకు ప్రాధాన్యత నివ్వటం, బాలికల్లో పెరు గుదల వేగంగా వుండే దశలో పోషకాహారలోపం శారీరక మార్పులు గురించి కిశోర బాలికలకు అవగాహన కల్గించటం, ప్రేమ పేరుతో జరిగే మోసాలు, లైంగిక వేధిం పులను బాలికలను రక్షించడానికి అవగాహన కల్గించటం, ఆత్మవిశ్శాసాన్ని పెంచి, భవిష్యత్తులో ఆర్థికంగా స్వంతంత్రగా ఎదిగేలా చేయటం ఈ కార్యక్రమ ఉద్దేశ్యమన్నారు. డాక్టర్ ప్రవీణకుమార్ మాట్లాడుతూ బాల్యవివాహాలు చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని, 18 ఏళ్లు నిండిన తరువాత మాత్రమే వివాహాలు చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో తూర్పుగంగవరం పిహెచ్సీ వైద్యులు శ్రీకాంత్, ఏపీఎం దేవరాజ్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ సునీత, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు మహిళా పోలీస్ లు, విఆర్వోలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


