బేగంపేట, మే 10,
( జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట డివిజన్ నుంచి పరేడ్ మైదానంలో జరిగిన ప్రధాని మోదీ సభకు బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ (నందు) ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు తరలి వెళ్లారు. కాషాయ జెండాలు, మెడలో కమలం కండువాలు ధరించి మోడీ సభకు హాజరయ్యారు.
పరేడ్ మైదానానికి తరలి వెళ్లిన వారిలో జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి
సి. విజయ్ కుమార్, మహిళా నాయకురాలు విజయమ్మ, డివిజన్ ప్రధాన కార్యదర్శి టి. శ్రవణ్. జిల్లా కార్యదర్శి శాలింద్రి శ్రీనివాస్ యాదవ్ డివిజన్ అధ్యక్షుడు మహేష్ కుమార్, అశోక్ యాదవ్, గోవింద్, రేణుక, క్రాంతి, లోహిత్ తదితరులు పాల్గొన్నారు.

