బేగంపేట ,మే 12, (జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ ఎస్పి రోడ్డు లోని శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో మంగళ వారం.హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ఈవో శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సి బద్రీనాథాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఐదు గంటల 30 నిమిషాలకు మన్యుసూక్త విధానం, స్వామివారికి ఆవుపాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష తమలపాకులతో స్వామివారికి విశేష అర్చన జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించి అన్నదానంలో పాల్గొన్నారు.

