విచక్షణా రహితంగా ఎరువుల వాడకం వలన భూమి సహజ బౌతిక స్థితిని కోల్పోయి ఆశించిన మేర ఫలితాలు రావని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవెత్త డాక్టర్ తూము వెంకటేశ్వర రెడ్డి అన్నారు. తూర్పుగంగవరం రైతు సేవా కేంద్రంలో సమగ్ర ఎరువుల యాజమాన్యంపై తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు అధ్యక్షతన రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. నాగంబొట్ల పాలెం సొసైటీ చైర్మన్ వల్లభనేని సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా కెవికే శాస్త్రవెత్త డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ యూరియా, డిఏపి పంట కాలంలో నగం తగ్గించాలని కోరారు. జీవన ఎరువుల వాడకం పెంచుకోవాలని కోరారు. మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ జింక్, జీవన ఎరువులు విస్తృతంగా వాడుకోవాలని చెప్పారు. ప్రకృతి సాగును చేపట్టాలని కోరారు. సొసైటీ చైర్మన్ సుబ్బయ్య మాట్లాడుతూ సొసైటీలో ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా గత నంవత్సరం అందించామని, ఉ న్నతాధికారుల సహకారంలో ఈ సంవత్సరం కూడ ఎరువులు వీలున్నంత వరకు అందరికి అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విఏఏ సుప్రజ, సెరికల్చర్ అసిస్టెంట్ రఘ, ఐసీ ఆర్ పీ లు, సొసైటీ సీఈఓ శ్రీనివాస రెడ్డిలు పాల్గొన్నారు. నానో డిఏపీ, నానో యూరియా గురించి వివరించారు. పలువురికి అందించారు.
