కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్లో అయిదేళ్ల బాబుకు అరుదైన దవడ శస్త్రచికిత్స………అయిదేళ్లుగా తెరుచుకోని నోటిని శస్త్రచికిత్స ద్వారా తెరుచుకునేలా చేశాం – డాక్టర్ నిశాంత్ సాధనాల.

బేగంపేట మే 13,(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రిలో అయిదేళ్లుగా తెరుచు కొని నోటిని శస్త్ర చికిత్స ద్వారా తెరుచుకునేలా చేసి అబ్బుర పరిచారు.పుట్టిన కొద్ది నెలల్లోనే ఆ బాబుకు నోరు తెరవలేక ఇబ్బంది పడుతుంటే ఆ తల్లిదండ్రులు కొన్ని నెలల్లో సమస్య సర్దుకుంటుందని భావించారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతూ బాబు ఆయిదు సంవత్సరాల వయస్సు వచ్చే సరికి నోట్లో ఒక్క వేలు కూడా సరిగ్గా పెట్టుకోలేని పరిస్థితి, కుడివైపు దవడ ఎదుగుదల నిల్చిపోవడంతో తోడబుట్టిన చెల్లెలు పది నిమిషాల్లో తినే ఆహారం తాను తినేందుకు గంటకు పైగా సమయం పట్టడం, నవ్వలేకపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, స్లీప్ ఆప్నియాతో సరిగ్గా గంట సేపు సరిగ్గా నిద్రపోలేని పరిస్థితిలో ఆ కుటుంబం
తీవ్ర ఇబ్బంది పడింది.బాలుని పరిస్తితి చూసి తల్లి ,దండ్రులు మానసిక వేదనకు గురయ్యారు.సిద్దిపేటకు చెందిన పి.కరుణాకర్ కుమారుడు పి. యశ్వంత్
ఈ సమస్యతో బాధపడుతూ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ని కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ రీ కన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ నిశాంత్ సాధనాలను కలిశారు. బాబును పరీక్షించగా బాబు పుట్టిన కొద్ది నెలల్లోనే కుడివైపు దవడ ఎదుగుదల ఆగిపోవడంతో బాబు నోరు తెరుచుకోకపోవడం, నోటి కదలికలు ఆగిపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి సమస్యలు గుర్తించారు.
ఈ పరిస్థితిని టెంపోగోమ్యాండిబ్యులర్ జాయింట్(టిఎంఐ) యాంకిలోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా బాబుకు ఉన్న సమస్యను పరిష్కరించవచ్చని నిర్ణయించిన డాక్టర్ నిశాంత్ సాధనాల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నాకు కూడా ఇతర పిల్లల్లా నోరు తెరవాలని, సంతోషంగా నవ్వాలని ఉంది కానీ నేను నోరు తెరవలేకపోతున్నా నా నోట్లో ఆడ్డుగా ఉన్న పళ్లను రాయితో కొట్టేయాలని చిన్నారి తన అమ్మమ్మ దగ్గరకు వచ్చి చెప్పిన మాటలు డాక్టర్తో పాటు అక్కడ ఉన్నవారిని హృదయాలను కలిచివేసింది.
ఈ సమస్యను ,,యాంకిలోసిస్ రిలీస్ విత్ కోస్టోకాండ్రల్ గ్రాఫ్ట్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్స చేయాలని డాక్టర్ నిశాంత్ సాధనాల నిర్ణయించారు. చిన్నారి దవడ ఓపెన్ చేసి జాయింట్ స్కల్ బేస్కు పైన రెండు బోన్స్ వద్ద ఫ్యూజన్ కావడంతో దవడ ఎదుగుదల ఆగిపోవడం, దవడ ఎదుగుదల కూడా దానిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి గ్రోత్ సెంటర్ కూడా డ్యామేజి ఆయి ఓక వైపు దవడ ఎదుగుదల ఆగిపోయింది, యాంకిలోసిస్ రిలీజ్ సర్జరీతో 1 మిల్లీమీటర్ నుంచి 2 మిల్లీ మీటర్లు మాత్రమే తెరుచుకునే నోటిని 34 మిల్లీ మీటర్లు తెరుచుకునేలా ఓపెన్ చేశారు. ఆగిపోయిన దవడ బోన్ గ్రోతు కొనసాగింపుగా రిబ్ కార్టిలేజ్ను తీసి వేయడం ద్వారా వయస్సుతో పాటు దవడ ఎముక పెరిగి ముఖం షేపు కూడా మారకుండా ఉంటుంది. ఈ ఆరుదైన శస్త్రచికిత్సను అయిదు గంటల పాటు నిర్వహించారు.
శస్త్రచికిత్స తరువాత బాబు పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాడని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయినట్లు డాక్టర్ తెలిపారు. చాలా ఏళ్ల తరువాత మా బాబు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడని, నోరు కూడాతెరవగలుగుతున్నాడని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పిల్లల్లో నోరు తెరుచుకోవడంతో ఇబ్బంది, ముఖం ఆవకతవకలు, గురక, నిద్రలో ఇబ్బందులు, తినడంలో సమస్యలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలిసి తగిన చికిత్స అందిస్తే పిల్లల ఎదుగుదలనుసరిచేయవచ్చని బేగంపేట, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ రీ కన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ నిశాంత్ సాధనాల తెలిపారు. ఈ సందర్భంగా బాబు కుటుంబ సభ్యులు కిమ్స్ సన్ షైన్ వైద్యులకు కృతఙ్ఞతలు తెలియ జేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *