ప్రభుత్వం పేద వర్గాలకు అందజేస్తున్న పథకాల అమలులో అక్రమాలు జరుగకుండా విజిలెన్స్ కమిటీసభ్యులు పర్యవేక్షణ చేపట్టాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు తెలిపారు. తాళ్లూరు లో మండల సమావేశం హాలు లో విజిలెన్స్ కమిటీ చైర్మన్, తహసీల్దార్ గోపాలుని ఫణీంద్ర అధ్యక్షతన మండలస్థాయి విజిలెన్సుకమిటీ స మావేశం బుధవారం జరిగింది. ఈసందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్న నిత్యావసర వస్తువులు లబ్దిదారులకు అందుతున్నదీ లేనిది గుర్తించి కమిటీ దృష్టికి తీసుక రావాలన్నారు. గ్యాస్ సిలెండర్లు వినియోగ దారులకు అందకుండా అక్రమ మార్గంలో బ్లాక్ మార్కెట్ కు తరలివెలుతున్నాయని అధికధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నందున రెవెన్యూ అధికారుల దృష్టి సారించాలన్నారు. ఏజన్సీ నిర్వహకులు కూడా గ్యాస్
అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాధులు అందుతున్నందున రెవెన్యూ అధికా రులు దృష్టి సారించాలన్నారు. అధికంగా గ్యాస్ బుక్ లు
తీసుక వచ్చిన వారికి సిలెండర్లు ఇవ్వకుండా కట్టడి చేసి బుక్ చేసిన వారికే సిలెండర్లు అందజేయాలన్నారు. ప్రజలకు సక్రమ రీతిలో పనులు చేస్తూ ప్రభ్వుత్వంకు చెడ్డపేరు లేకుండా మంచిపేరు వచ్చే విధంగా విజిలెన్సు కమిటీ సభ్యులు వ్యవ హించాలన్నారు. జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి మాట్లాడుతూ మండలంలో
రేషన్ షాపులపై ఆర్. ఐ పర్యవేక్షణ లేక పోవటం ఏమిటని ప్రశ్నించారు. ఎన్ని రేష న్లు వున్నాయి. రేషన్ షాపుల తనిఖీలు చేయక పోతే ఎ లా అని ఆర్. ఐ
ను ప్రశ్నించారు. రేషన్ షాపులందు ఏఏ నిత్యావసరవస్తులు వున్నది, ఎంత మెర స్టాక్ ఉన్నది తెలిపే బోర్డులు ఉండేలా చూడాలన్నారు. కార్డుదారులకు రేషన్ ఇవ్వ కుండా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారా అన్న విషయాలను గమనించి అధికారుల దృ ష్టికి తీసుక రావాలన్నారు. ఎంపీడీవో పి.అజిత మాట్లాడుతూ ఆహారభద్రతా చట్టం మేరకు ప్రభుత్వ ఫలాలు అర్హులకు పారదర్శకంగా అందేలా చూడాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ నిర్వహించే పనులను పరిశీలించి లోపాలు వుంటే కమిటీ దృష్టికి తీసుక వచ్చి లోపాలను సరిదిద్దాలన్నారు. గ్రామస్థాయి లో అర్హులంద రికి న్యాయం జరిగేలా చూసే బాధ్యత అందరిపై వుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ బాల కోటయ్య, ఎంఈవో -2 సుధాకర్ రావు, హెచ్ఎం ఆరోమ్ మిల్టన్, ఆరై ఎం. సుధీర్ కుమార్, కమిటీ సభ్యులు ఎస్ నరేంద్రనాథ్ రామాంజనేయులు తదితరులు పాల్గొ న్నారు.
