అన్ని పాఠశాల బస్సులను ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (ఎఐఎస్ -063) ప్రకారం పాఠశాలల, కళాశాలల బన్సులు నిబంధనలు పాటించాలని దర్శి ఎంవీఐ రవి కుమార్ కోరారు. తాళ్లూరు మండలంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల బన్సులను జిల్లా ఉప రవాణా కమీషనర్ ఆర్ సుశీల ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎంవీఐ జన్వంత్, సిబ్బందితో కలసి తూర్పుగంగవరం, తాళ్లూరులలో పాఠశాలల బన్సులను పరిశీలించి ఎఐఎస్ నిబంధనల ప్రకారం ఉన్నవా లేవా అన్న విషయాలను పరిశీలించి లేని వాటిని నిబంధనలను అనుగుణంగా మార్పు చేసుకోవాలని సూచించారు. బస్సు నిర్మాణం, భధ్రతా ఫీచర్లు, విఎల్ టిడి, పానిక్ బటన్, బన్సు ఎక్కు నమయంలో మెట్లు ఎత్తు 225 మి.మీలు మాత్రమే ఉండాలని నూచించారు. విఎల్టి పరికరాలతో పాటు, ఎమర్జెన్సీ డోర్స్ పనిచేయు తీరు కూడ సక్రమంగా ఉండాలని సూచించారు. డ్రైవర్లు, అటెండర్ల వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలని నూచించారు. పూర్తి వివరాలతో ఎంవీఐ కార్యాలయంకు సమర్పించాలని చెప్పారు.

