నకిలీ నంబర్ ప్లేట్‌ వాడుతున్న యువకుడిపైకేసు నమోదు…

సనత్ నగర్, మే 14,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవాలని స్కెచ్ వేశాడో ప్రబుద్ధుడు. తన వాహనానికి మరొకరి నంబర్ ప్లేట్ తగిలించి పోలీసుల కళ్లు గప్పాలనుకున్నాడు. కానీ, టెక్నాలజీ సాయంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆ కిలాడీని పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన జి. సాయి గణేష్
తన హోండా యూనికార్న్ బైక్‌కు ఒరిజినల్ నంబర్ (AP21AV6721) కాకుండా, నంద్యాల జిల్లాకు చెందిన మహమ్మద్ జాఫర్ అనే వ్యక్తికి చెందిన AP21BC2008 నంబర్ ప్లేట్‌ను
వాడుతున్నాడు. ఇతడు చేసిన ఉల్లంఘనలన్నీ ఏ పాపం తెలియని జాఫర్ ఖాతాలోకి చలాన్ల రూపంలో వెళ్తున్నాయి.వాహనాల తనిఖీల్లో ఈ మోసం బయటపడటంతో సనత్‌నగర్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు సాయి గణేష్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు మోటార్ వాహనాల చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చలాన్ల ఎగవేత కోసం ఇలా నకిలీ నంబర్ ప్లేట్లు వాడటం తీవ్రమైన నేరమని, నిందితులపై కఠిన చర్యలు తప్పవని జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) డి. జోయల్ డేవిస్ హెచ్చరించారు.నగరవ్యాప్తంగా ఉన్న ANPR కెమెరాల నిఘాలో ఇలాంటి మోసాలను సులభంగా గుర్తిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎవరికైనా తమ వాహనంపై తప్పుడు చలాన్లు వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వెబ్‌సైట్ ద్వారా లేదా ట్రాఫిక్ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *