బాలల హక్కులపై అవగాహన

తాళ్లూరు మండలం రజానగరంలో గ్రామ సచివాలయంలో కిశోరి వికాసం వేసవి సెలవుల శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో అజిత మాట్లాడుతూ …..కిశోరి బాలబాలికల తల్లిదండ్రులను భాగస్వాములను చేసి బాల్య వివాహాలు జరగకుండా, విద్యార్థులు స్కూల్ డ్రాప్‌అవుట్ కాకుండా, బాల కార్మిక వ్యవస్థ లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బాలల హక్కులు, స్వీయ అవగాహన, గ్రామస్థాయి కమిటీల బాధ్యతలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో బాలల సంరక్షణకు సంబంధించిన చట్టాలు, గ్రామస్థాయి కమిటీల విధులు, కిశోరి వికాసం కార్యక్రమాల అమలు తదితర అంశాలపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అజిత, తహసిల్దార్ ఫణీంద్ర, ఎంఈఓ సుబ్బయ్య, అంగన్వాడి సూపర్వైజర్ సునీత, వీఆర్వో నాగూర్ బి, మండల సర్వేయర్ మహేష్, మాజీ సర్పంచ్ కాశీం సైదావలి, అంగన్వాడి మరియు సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *