బేగంపేట, మే 18 (జే ఎస్ డి ఎం న్యూస్):
మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో (Special Drive) భాగంగా బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఒకే రోజులో మొత్తం 333 కేసులు నమోదు చేశారు.ఈ విస్తృత తనిఖీలలో సీఐ జానకి రాములు, సీఐ ప్రమోద్ కుమార్, ఎస్‌ఐలు హరీష్, శివరాజ్, అశోక్ రెడ్డి, దేవిదాస్, విజయ్ కాంత్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది స్వయంగా రోడ్డుపైకి దిగి పర్యవేక్షించారు.
కేసులు మరియు జరిమానాల వివరాలు ఇలా ….:
రాంగ్ సైడ్ వయలేషన్ (Contact): 197 కేసులు — రూ. 2,36,700 జరిమానా
రాంగ్ సైడ్ వయలేషన్ (Non-Contact): 136 కేసులు — రూ. 1,64,700 జరిమానా
మొత్తం కేసులు: 333
మొత్తం వసూలైన జరిమానా: రూ. 4,01,400
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:
ఈ సందర్భంగా ట్రాఫిక్ అధికారులు మాట్లాడుతూ.. మోటార్ వాహనాల చట్టం (MV Act) సెక్షన్స్ 119/177, 179, మరియు 184 కింద రాంగ్ సైడ్ డ్రైవింగ్ & డేంజరస్ డ్రైవింగ్‌కు గానూ ఈ జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. రాంగ్ రూట్‌లో రావడం వల్ల తోటి వాహనదారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, ఇకపై కూడా తనిఖీలు ఇలాగే కొనసాగుతాయని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.



