నాగన్న వాగు అక్రమంగా ఆక్రమిస్తున్న రియల్ ఎస్టేట్ ముఠాపై చర్యలు తీసుకోవాలి

నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో మాచవరం రహదారి వెంబడి ఉన్న నాగన్న వాగును ఆక్రమించి వాగును లోతుగా చేసి గ్రామం పైకి వరద నీరు వచ్చే విధంగా చర్యలు చేపడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అధికార టీడీపీ పార్టీ నేత పై చర్యలు తీసుకోవాలని ఉప్పుగుండూరు గ్రామం నాగన్నవాగు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ రాజాబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుగా ప్రవహించే నాగన్నవాగు వెంబడి భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కనగాల రామకృష్ణ భూములను కొనుగోలు జరిపి ఆ భూములకు ఎదురుగా ఉన్న నాగన్న వాగును 80 సెంట్లుకు పైగా ఆక్రమించారని వాగు పూర్వ స్వభావం మలుపులు తిరిగి వాగు ప్రవహిస్తూ ఉంటుందని దానిని మలుపులు లేకుండా నేరుగా చేయడం ద్వారా వరద ఉధృతి గ్రామంలో దక్షిణం బజారు, బలిజ పాలెం, బీసీ కాలనీలలోకి వేగంగా వరద నీరు వచ్చి ఆస్తి నష్టం సంభవిస్తుందని, దీంతోపాటు మూగజీవాలుకు ప్రాణ నష్టము, మెట్ట భూములుకు వరద నీరు వచ్చిపంట నష్టము వాటిని తీవ్ర ఇబ్బందులు పడతామని వాగు పరిరక్షణ సమితి నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రెవిన్యూ అధికారుల ద్వారా విచారణ చేపట్టి వరద నీరు గ్రామం పైకి రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాగన్న వాగు పరిరక్షణ సమితి నాయకులు గోగినేని దుర్గాప్రసాద్ పావులూరు లతీష్, బెల్లం.శ్రీనివాసరావు, గోగినేని గోపి, బెల్లం శేషారావు, మసిముక్కు భాస్కరరావు జంజనం.సుబ్బయ్య, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *