ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సోమవారం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబును క్యాంపు కార్యాలయంలో కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి, ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకలు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించారు. ఈ సమావేశంలో ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ ఐషయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

