బక్రీద్ పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ ఎస్. మల్లికార్జున రావు సూచించారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ముస్లిం మత పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టప్రకారం ఆవులు, దూడలు ఇతర నిషేధిత పశువులను వధించడం తీవ్రమైన నేరమని తెలిపారు. గోవధకు పాల్పడిన వారిపై నాన్ బే యిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాల్లో జంతువులను వధించడం, వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా వదంతులు, పుకార్లు వ్యాప్తి చేసి మత సామరస్యానికి భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ బక్రీద్ పండుగను పరస్పర గౌరవంతో, చట్ట నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఎక్కడైనా చట్టవిరుద్ధంగా పశువుల అక్రమ రవాణా లేదా గోవధ జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
