ఘనంగా 103వ ఎన్టీఆర్ జయంతి

నాగులుప్పలపాడు మే 28 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత మాజీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి ఉత్సవం ఉప్పుగుండూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే తెలుగు రాష్ట్రాలలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజకీయ చైతన్యంతో పాటుగా ఆర్థిక చైతన్యం కూడా సాధ్యమైందని శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమంలో అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు అల్పాహారాన్ని అందజేశారు. జయంతి సందర్భంగా జరిగిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కో కన్వీనర్ మసిముక్కు భాస్కరరావు, నల్లూరి భాస్కరరావు గద్దె త్యాగరాజు,,తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్చార్జులు కుంచాల నాగరాజు, నాగయ్య, బి .సి.సెల్ మండల అధ్యక్షుడు కూతంబాకం సెల్వం , టిడిపి వాణిజ్య విభాగం నాయకులు కోడూరి ప్రభాకర్,ఎస్టీ సెల్ బాపట్ల పార్లమెంటరీ అధ్యక్షులు తిరుమల శెట్టి శ్రీనివాసరావు, బెల్లం శ్రీనివాసరావు కొంజేటి రామకృష్ణ, కుంభా పార్వతి, జనసేన నాయకులు బాలిశెట్టి నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ కోండ్రు ఆశీర్వాదం, కొండ్రు దాసు, పావులూరు లతీష్ జాలాది సురేంద్ర, డాక్టర్ మిండల శ్రీనివాసరావు, సింగరయ్య, తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *