ప్రత్యేకాధికారులు,పంచాయతీ అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలి -ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు

ప్రత్యేకాధికారులు, బి పంచాయతీ అధికారులు గ్రామా ల్లో ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని ఎంపీపీ తాటికిండ శ్రీనివాసరావు అన్నారు. స్థానికమండల పరిషత్ కార్యాలయసమావేశంహాలులో శనివారం మం డల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈసందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రత్యేకాధికారుల పాలన వచ్చినందున గ్రామల్లో ఉన్న సమస్యలపై అధికారులు,నాయకులు కుర్చోని చర్చించుకుని సమన్వయంతో ముందుకు సాగాల న్నారు.ప్రభుత్వాధికారులు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుక వెళ్లి అర్హతగల వర్గాల వారికి లబ్ధి చేకూర్చి ప్రభుత్వంకు మంచి పేరు తీసుక రావాలన్నారు. ఎంపీడీవో అజిత వచ్చిన నాటినుండి గ్రామాలు అభివృద్ది చెందేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి కృషి చేస్తున్నారన్నారు. గ్రామకార్యదర్శుల కొరత లేకుండా కొత్త వారినియామకాలు జరిగాయని పంచాయతీ కార్యదర్శులు ఎం పీడీవో కు సహకరించి మండలాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలన్నారు. జడ్పీటీసీమారం వెంకటరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు అధికంగా వుండగా సమస్యలు చర్చించేందుకు రెవెన్యూ అధికారులు రాక పోవడేమిటని ప్రశ్నించారు. తహసీల్దార్ రాకుండా క్రింది స్థాయి అధికారులు సమావేశానికి వొస్తే ఎవరిని అడగాలన్నారు.
రీసర్వే గ్రామాల్లో వస్తున్న సమస్యలను రెవెన్యూ అధికారులు గుర్తించి పరిష్కరించాలన్నారు గ్రామాల్లో పారిశుద్య సమస్యలు ఉన్నాయని, ప్రజలు తమ దృష్టికి తీసుక వస్తున్నారని, పంచాయతీ అధికారులు బాధ్యతా యుతంగా పని చేసి పారిశుధ్య సమస్యలు లేకుండా చూడాలన్నారు. వైస్ఎంపీపీ ఐ.వెంకటేశ్వ రరెడ్డి మాట్లాడుతూ రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో రైతులకు ముందుగా నోటీ సులు ఇచ్చి వారి సమక్షంలోనే సర్వే నిర్వహిస్తే తప్పులు దొర్లవన్నారు. తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయ అవరణలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్తు లోఓల్టేజ్ సమస్య పరిష్కారం చేయాలని తెలిపారు. పంచాయతీ అధికారులు బాద్య తగా పని చేస్తే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయన్నారు. ఎంపీడీవో పి. అజిత మాట్లాడుతూ స్వచ్చగ్రామాలుగా, ఆరోగ్య గ్రామాలుగా ఉండేందుకు పంచాయతీ అధికారులు ప్రజలతో సత్ససంబంధాలు కొనసాగిస్తూ బాధ్యతగా పని చేస్తే సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలని, పంచాయతీల అభివృద్దిలో కార్యదర్శులే కీలకమన్నారు. గ్రామాల్లో భాద్యతగాకార్యదర్శులు పని చేసి మండలానికి మంచి పేరు తీసుక వస్తారని సభాముఖంగా ఆమె హామీ ఇచ్చారు. తూర్పుగంగవరంకు మూడు నెలలుగా రామతీర్థంమంచినీరు రాక ప్రజలు దాహర్తితో ఇబ్బందులుపడుతున్నారని నాగంబొట్లపాలెం సొసైటీ అధ్యక్షులు వల్లపునేని సుబ్బయ్య సభ దృష్టికి తీసుక వచ్చారు. బొద్దికూరపాడులో మంచినీటి కుళాయిలకు మురుగునీరు వస్తు ప్రజలు
ఇబ్బందులు నడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని తెలిపాడు. ఈ సమా వేశంలోవైస్ ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర నాటక అకాడమి కార్పోరేషన్ డైరెక్టర్ ఓబుల్ రెడ్డి, డీబీసీ వైస్ ప్రసిడెంట్ టి.శి వనాగిరెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాస రావు, వైద్యులు ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, హోమియోవైద్యురాలు శిరీష ఏఈలు హనుమంతరావు, రామకృష్ణారెడ్డి, ఏపీవో వెంకటేశ్వర్లు, ఏపీఎమ్ దేవరాజ్,ఆర్ఎ సుధీర్ కుమార్,ఎంపీటీసీలు పలుశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *