రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండుకూటమి పాలనలోనే సాద్యమవతున్నదని మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలోఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎంపీడీవో అజితతో కలిసి పెన్షన్ దారులకు పెన్షన్ నగదు సోమవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీఆచారక పాలన వల్ల రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నా అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడులు తెస్తూ రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ నగదు పెంచి క్రమం తప్పకుండా పెన్షన్దాదారులకు అందజేస్తూ కూటమిప్రభుత్వం సంక్షేమానికి బాటలు వేస్తున్నదన్నారు.మండలంలోని 16 పంచాయతీలందు 6089 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీచేయాల్సి వుండగా 4047 మందికి మొదటి రోజు 68శాతం జరిగినట్లు ఎంపీడీవో పి.అజిత తెలిపారు. మిగిలిన పెన్షన్ దారులకు 3వ తేదీ పెన్షన్ల పంపిణిచేయాల్సి వుండగా 4047 మందికి మొదటి రోజు 68శాతం జరిగినట్లు ఎంపీడీవో పి. అజిత తెలిపారు. మిగిలిన పెన్షన్ దారులకు 3వ తేదీ వరకు పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో కూటమి శ్రేణులు గ్రామాల్లోని వితంతువులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, వివిధరకాల పెన్షన్లు లబ్ధిదారులకు సిబ్బందితో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం
లోవల్లపనేని సుబ్బయ్య, షేక్అన్వర్ బాష,బద్దులశ్రీను,పంచాయతీ కార్యదర్శి నాగ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
