14మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు – 2లక్షల 29వేలు స్వాధీనం.

బోయినపల్లి , జూన్‌ 15:(జె ఎస్ డి ఎం న్యూస్) బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ఆర్ నగర్ సమతా నిలయంలో 14మంది పేకాటరాయులను అరెస్టు చేసి 2లక్షల 29వేల రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు బోయినపల్లి ఎస్ఐ శివశంకర్ తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం పెట్రోలింగ్ కారు సిబ్బంది చుక్కా ప్రసాద్,బి రామకృష్ణ,బి రమేష్ మురళి,ఎం శ్రీనివాస్,డి హనుమరెడ్డి లు ఆదివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఆర్ఆర్ నగర్ లోని ఓ ఇంట్లో మధ్యవర్తి వ్యక్తి ద్వారా 14మంది పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది .ఒక ప్రధాన నిర్వాహకుడి ద్వారా సట్టా పందాలు వేస్తున్నామని,కనకయ్య కుమారుడు గొడుగు చందును పంపుతున్నామని నిందితులు పేర్కొన్నారని తెలిపారు. బేగంపేట ఎసిపి గోపాలకృష్ణ మూర్తి ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *