మహిళలకు చీరలు పంపిణీ పేరుతో అవమానం చేయడం దుర్మార్గమైన చర్య.. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం.

బేగంపేట, జూన్ 24,( జే ఎస్ డి ఎం న్యూస్ ) :
మహిళలకు చీరలు పంపిణీ పేరుతో అవమానం చేయడం దుర్మార్గమైన చర్య అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు విమర్శించారు.బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.. మహిళలకు పంచే చీరల పంపిణీ పేరుతో మహిళల కు ఐరిష్ పరీక్షలునిర్వహించడం, ఆధార్ కార్డులను సేకరించడం,మహిళల ఒంటిపై చీరను కప్పి ఫొటోలు తీయడం వంటి విపరీత చర్యలను తీవ్రంగాఖండిస్తున్నామనీ కూకట్పల్లి శాసన సభ్యుడు మాధవరం కృష్ణారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోమహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యపు కార్యక్రమంగా మారిందని విమర్శించారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కులమతాలకు అతీతంగా మహిళల అందరికీ చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చీరల పంపిణీ కార్యక్రమంలో ఐరిష్ పరీక్షలునిర్వహించాల్సిన అవసరం ఏముందనిప్రశ్నించారు.ఒకవైపు ఆధార్ కార్డులనుతీసుకోవడం మరో వైపు ఐరిష్ పరీక్షలను చేయడం, ఇచ్చిన చీరను ఒంటిపై కప్పుకుని ఫోటో తీయడం వంటి చర్యలను ప్రభుత్వం ఏవిధంగాసమర్ధిస్తున్నదని వెంటనే
అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఆనాడు కెసిఆర్ చేనేత కార్మికులకు అండగా ఉండేందుకు ఆడబిడ్డలకు పుట్టింటి సారిగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని.. వారికి ఉపాధి మార్గం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని రంజాన్,క్రిస్మస్ ,బతుకమ్మ ఇలా ప్రతి పండక్కుఆడపడుచులకు ప్రతి ఒక్కరికి చీర పంపిణీ చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ బై ఎలక్షన్లు ఉంటాయో ఎక్కడ వారికి అనుకూలంగా ఉన్నవారికి చీరలు పంపిణీ చేస్తున్నారు తప్ప ప్రతి మహిళకు అందేటట్లు చేస్త లేదని దీనిని కాంగ్రెస్ ప్రభుత్వంసమర్ధించుకుంటుందని ఎద్దేవా చేశారు.వెంటనే ప్రతి ఒక్కరికి అందేటట్టు చూడాలని ఆయన కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *