ఉపాధ్యాయ వృత్తిలో భగవద్గీతాదేవి సేవలు మరువలేనివని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. దర్శి శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో ఉపాధ్యాయు రాలు భగవద్గీతా దేవి పదవీ విరమణ సందర్భంగా ముందస్తు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్
బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. ఈసందర్భంగా న్యాయవాది రాజశేఖర రెడ్డి, భగవద్గీతాదేవి దంపతులను దుశ్శాలు వాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు.జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి తగు న్యాయం చేసిన వ్యక్తిగా అభినందించారు. ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయికి ఎదిగేలా
తీర్చి దిద్దారని కొనియాడారు. కార్యక్రమంలో దర్శి, తాళ్ళూరు, మండలాల కన్వీనర్లు వెన్న పూస వెంకటరెడ్డి, టి. వి సుబ్బారెడ్డి, వైసిపి జిల్లా కార్యదర్శి మారం ఇంద్రసేనా రెడ్డి, రాష్ట్ర మేధావుల ఫోరం జనరల్ సెక్రటరీ ఐవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిలు పోశం మధుసూధన్ రెడ్డి, సుంకర బ్రహ్మనందరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి బ్రహ్మారెడ్డి, వైస్ ఎంపీ పీలు సోము దుర్గారెడ్డి, బంకా నాగిరెడ్డి, మాజీ ఎం పీపీ వీరగంధం కోటయ్య, సుబ్బారెడ్డి, ఉపాధ్యాయ సంఘ నాయకులు ధనిరెడ్డి వెంకటరెడ్డి, వాకా జనార్దన్ రెడ్డి , న్యాయవాదులు, పలువు ప్రముఖులు పాల్గొన్నారు.


