తాళ్లూరు మండలంలోమొక్కుబడిగా పీజీఆర్ఎస్

ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేప డుతున్న కార్యక్రమాలు అధికారుల తీరుతో నీరు గారి పోతున్నాయి. ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ఇందుకు నిదర్శనం. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కా ర్యక్రమం మొక్కుబడిగా మారుతుంది. సోమవా రం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కు కేవలం నాలుగు శాఖల అధికా రులు మాత్రమే హాజరు కావటం అందుకు నిదర్శనం. కార్యక్రమం లో 15 శాఖల అధికారులు హాజరుకావాల్సి ఉండగా, నాలుగుశాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. తహసీల్దార్ బీవీ ర మణారావు, ఎంఈవో జి.సుబ్బయ్య, ఎన్ఆర్ఆజీఎస్ ఏపీవో వెంకటేశ్వర్లు, హౌసింగ్ అధికారి హనుమంతరావు మాత్రమే హాజరయ్యారు కావటం విశేషం. మిగిలిన అధికారులు తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని కార్యాలయాలకే పరిమితమయ్యారు . ఆయా
శాఖల తీరుపై ఉన్నత శాఖ అధికారులు ఎలా స్పందిస్తారు వేచి చూడాల్సిందే.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *