సికింద్రాబాద్,జూన్ 30 (జే ఎస్ డి ఎం న్యూస్)
ప్రభుత్వ ఉద్యోగ సిబ్బంది తమ ఉద్యోగ పదవీకాలంలో చేసిన సేవలు, వృత్తి నిబద్దత నే వారికి గుర్తింపునిస్తాయని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.వాణి పేర్కొన్నారు. మంగళవారం గాంధీ ఆసుపత్రి కాన్పరెన్స్ హాల్ లో జరిగిన ఎంఎన్ఓ ఈ.మహేశ్ పదవీ విరమణ ఆత్మీయ వీడ్కోలు అభినందన సమావేశం ఘనంగా జరిగింది. మహేశ్ తన ఉద్యోగపదవీకాలంలో అంకిత భావంతో వృత్తి బాధ్యతను నిర్వర్తించారని సూపరింటెండెంట్ కొనియాడారు. మహేశ్ శేష జీవితం ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని పలువురు అధికారులు, సిబ్బంది ఆకాంక్షించారు. ఈసందర్బంగా మహేశ్ ను శాలువలు,పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి ఆర్ఎంఓ–1 డా.జయకృష్ణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ గజానంద్ శ్రీనివాస్, రామకృష్ణ, వందన కుమార్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, మినిస్టిరియల్ అధికారులు, మహేశ్ కుటుంబసభ్యులు,సిబ్బంది పాల్గొన్నారు.
