రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయి వంద శాతం పెరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాల అమలు తీరు మరియు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో అందిన అర్జీలను పరిష్కార పురోగతిపై ఐవిఆర్ఎస్ కాల్స్ పై సమీక్షించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయి వంద శాతం పెరిగేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు జవాబుదారీతనంతో, నిజాయితీ తో, బాధ్యతతో విధులను నిర్వర్తించినప్పుడే ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం పై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి క్షేత్రస్థాయిలో అర్జీదారులు ఎదుర్కొంటున్న అంశాలపై ప్రత్యేక దృష్టిని సారించి సమస్యలను పరిష్కరిం చేల కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఆర్జీల పరిష్కారం పై సంబంధిత అధికారి అర్జీదారునితో మాట్లాడారా లేదా పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని, అలా పర్యవేక్షణ ఉన్నప్పుడే ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారం కాబడి ప్రజల సంతృప్తి స్థాయి పెరుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయి శాతం పెరిగేలా కృషి చేయాల్సిన భాద్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, బిసి కార్పోరేషన్ ఈడి వెంకటేశ్వర రావు, ఆర్డబ్ల్యూఎస్. ఎస్ఈ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

