బేగంపేట జులై 3(జే ఎస్ డి ఎం న్యూస్) :
జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికైన రెజ్ల ర్ లకు
మాజీమంత్రి, బి ఆర్ ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అండగా నిలిచారు. ఈ నెల 10 వ తేదీ నుండి మూడు రోజుల పాటు హర్యానా రాష్ట్రం లోని రోహ్ తక్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ కెటగిరీలలో 10 మంది బాలికలు, 20 మంది బాలురుఎంపికయ్యారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే
తలసాని శ్రీనివాస్ యాదవ్ రెజ్లర్ లకు ట్రాక్ లు, షూస్, పోటీలకు వెళ్ళి వచ్చేందుకు రవాణా ఛార్జీలకు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలలో సత్తా చాటాలని, గోల్డ్ మెడల్స్ తో తిరిగి రావాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో నే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్రీడల అభివృద్ధి కి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. వ్యాయామశాలల అభివృద్ధి కి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వ్యాయామశాల ల నిర్వాహకులు సన్మానించారు. తమను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రెజ్లర్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, అధ్యక్షుడు సంతోష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ అస్లాం, నసీర్ కూలకి, కాలియా, సలాం ఆమూది, కాలీద్ బామూస్, కోచ్ లు వైష్ణవి, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

