వికసిత్ భారత్ – జి రామ్ జి పథకంపై మండలంలోని పలు గ్రామాలలో గురువారం అవగాహన ర్యాలీలు నిర్వహించారు. తాళ్లూరులో వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి పాల్గొని విబి రామ్ జి పథకం ప్రాముఖ్యతను, కూలీలకు ప్రభుత్వం అందిస్తున్న మరింత చేయూతను వివరించారు. మల్కాపురంలో గ్రామ టిడిపి అధ్యక్షుడు షేక్ సైదా వలి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎపీఓ వెంకటేశ్వర్లు, ఎఫ్ఎ శ్యామ్ సన్ లు పథకం ప్రాముఖ్యతను వివరించారు. బొద్దికూరపాడు, వెలుగు వారి పాలెం, నాగంబొట్ల పాలెం లలో ఎపీఓ వెంకటేశ్వర్లు, టీఏ రామ క్రిష్ణ, నాగ రాజులు పాల్గొని పథకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

