అల్వాల్, జూలై 3 ,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గృహ చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.20.20 లక్షల విలువైన 13.4 తులాల బంగారు ఆభరణాలు, 330 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనంచేసుకున్నారు.ఏ సి పి గోపాల కృష్ణ మూర్తి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.మేదిశెట్టి శ్యామ్రావుదంపతులు జూన్ 3న తమ ఇంటికి తాళం వేసి మెదక్‌కు వెళ్లగా, జూన్ 27న తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు, అల్మారా పగులగొట్టి బంగారం, వెండి వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న కొల్లి లోవరాజు (38)
ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని చోరీకి పాల్పడినట్లు తేలింది. అనంతరందొంగిలించిన బంగారం, వెండి వస్తువులను పాపనీ రాజు (45), మైలారం మహేష్ చారి(46)లకు విక్రయించినట్లు పోలీసులుగుర్తించారు.
నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 13.4 తులాలబంగారు ఆభరణాలు, 330 గ్రాముల వెండి
వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, బేగంపేట ఏసీపీ పి. గోపాల కృష్ణమూర్తి, అల్వాల్ ఎస్‌హెచ్‌వో ఎ. ప్రశాంత్
పర్యవేక్షణలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె. వీరబాబు, ఎస్ఐలు కె. చంద్రశేఖర్, ఎ. మల్లేష్, క్రైమ్ సిబ్బంది ఛేదించారు.
ఈ సందర్భంగా ఇంటి వద్ద సీ సీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని, గృహ సేవకులు, వాచ్మెన్ల వివరాలనుతప్పనిసరిగాధ్రువీకరించుకోవాలని ఏ సి పి ప్రజలకు సూచించారు.

