ఓటర్ జాబితాలో ప్రతి ఒక్కరికీ స్థానం కల్పించాలిసికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్.

సనత్‌నగర్,జులై 2,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బీకే గూడాలో పలు పోలింగ్ బూత్‌లను బీజేపీ నియోజకవర్గ బీఎల్‌ఏ-1, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నాయకులతో కలిసి బూత్ స్థాయి అధికారులను (బీఎల్ఓలు), బూత్ స్థాయి ఏజెంట్లను (బీఎల్‌ఏలు) కలిసి ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ఒక్కరు కూడా ఓటర్ జాబితాలో మిస్ కాకుండా అందరికీ ఓటు హక్కు అందేలా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు ఆకుల మహేష్, అశ్విని, సర్మనీ నరేష్ ముదిరాజ్, సుధాకర్ ముదిరాజ్, ధర్మేందర్, ఐలా శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *